24 October 2012

టైప్‌ - బి

వ్యక్తిత్వ విశ్లేషణ
1. జీవితం అంటే కార్ల రేస్కాదు. జీవితం ఉన్నది కేవలం అనుభవించడానికి, ఆనందించడానికి.
2. జీవితం భోగ వస్తువు. సంతోషమే ప్రధానం. ఏదో ఘనత సాధించాలన్నది ధ్యేయం కాదు.
3. జీవితం సగటు కన్నా ఎక్కువగా ఉంటే చాలు. జీవితంలో ఏదో సాధించాలనే ఆవేదన, ఆశ ఉండదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. జీవితాన్ని కావాలని దు:ఖమయం చేసుకోరు.
4. వృత్తిపరంగా లభించిన విజయం చాలు. సంతృప్తి చెందుతారు. ఆనందమయ జీవులు. వీరు వృత్తి జీవితానికి చెందని విజయానికి, జీవితంలోని సుఖానికి గల బేలెన్సును చూస్తారు. సంతృప్తి చెందుతారు.
5. దేనిని గురించైనా అతిగా ఆలోచించరు. ఆవేదనకు గురి కారు. బ్రతికినంత కాలం ఆనందంగా బ్రతుకుదాం. కష్టాలను కొనితెచ్చుకోవడం వీరికి ఇష్టం ఉండదు.

No comments:

Post a Comment