30 October 2012

రిలాక్స్ ప్లీజ్


స్ట్ర్రెస్ మేనేజిమెంట్


28 October 2012

పాజిటివ్ థింకింగ్


మంచి మానసిక స్థితికి టిప్స్‌

ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు. మంచి మానసిక స్థితి కూడా కలిగివుండాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఈ క్రింది సైకలాజికల్‌ టిప్స్‌ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో మీకోసం...
1. మానసిక ఒత్తిడిని గుర్తించండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
2. ఒకేపనిని నిరంతరం చేస్తుండడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కొంత విరామం తీసుకోండి. ప్రశాంతంగా ఉంటారు.

ఆహారపు అలవాట్లు


మనసుపై ప్రభావాలు
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు. మీరు తీసుకునే ఆహారం, మీరు ఆహారం తీసుకొనే విధానం మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయంటే అతిశయోక్తి కాదు. శృంగారం, భోజనం, డ్రైవింగు ఈ మూడిరటిలో మనిషి వ్యవహారశైలి అతని వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుందని చెబుతారు. అందుకే కలసి భోజనం చేయడమనేది సాటిమనిషికి మనమిచ్చే గౌరవంగా భావించడం ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతులలోనూ ఉంది.   మారుతున్న జీవనశైలి దేశప్రజల ఆహారపు అలవాట్లలో పెనుమార్పులు తీసుకువచ్చింది. అయితే ఆధునికమానవుడు, ముఖ్యంగా ఉన్నతవిద్యావంతులు ఆహారానికీ, మనసుకూ ఉన్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.  శరీరాన్ని పోషించుకోవడానికే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా మంచి ఆహారపు అలవాట్లు అవసరం అనే సంగతిని విస్మరిస్తున్నారు. ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి అనేక రకాల మానసిక రుగ్మతలకు ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి.  

దేవుడు - సైకాలజీ


దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం. ఆ సందేహం తీర్చుకోవడానికి మనిషి ఏం చేశాడు? ఉంటే ఉన్నాడు... లేకుంటే లేడు. ఓ దండం పారేస్తే పడుంటుంది అనుకున్నాడు. కృషిని వదిలేసి అభూత కల్పనల ఒయాసిస్సుల్లో సేదతీరాడు. దేవుడు గారికి కోపం వచ్చింది. అరిషడ్వర్గాలనే ఆరుగురు సైనికులను మనిషిమీదకు యుద్ధానికి పంపాడు. మనిషికి విశ్రాంతి నశించింది. యుగాల తరబడి యుద్ధం చేస్తూ ఓడిపోతూనే ఉన్నాడు. ఉన్నావా... అసలున్నావా? నువ్వు లేవని నిరూపించదలుచుకున్నావా అంటూ ఇంకా అయోమయంలోనే మనిషి మాత్రం ఉన్నాడు.  

ఆడవాళ్లూ - టీవీ సీరియళ్లూ



ఆంధ్రప్రదేశ్‌లో ఆ మాటకొస్తే భారతదేశంలో ఆడవాళ్లు టీవీ సీరియళ్లు చూడకుండా ఉండలేరనీ, ప్రతిరోజూ నిర్ణీత సమయానికి సీరియళ్లు చూడటం వారికి ఒక వ్యసనమయిపోయిందనీ, స్త్రీల జీవితంలో టీవీ సీరియళ్లు అనివార్య అవిభాజ్యఅంగాలై పోయాయనీ ఒక విశ్లేషణ, ఒక ఫిర్యాదు. ఒక ప్రచారం. ఇలా ఎందుకంటున్నామంటే అందరూ నిజమనుకొనే చాలా అంశాలు నూరు శాతం సత్యాలు కానట్లే, ఇది కూడా నూరుశాతం సత్యం కాదు.

27 October 2012

వీడియోలు

స్ట్రెస్ మేనేజిమెంట్ 1



స్ట్రెస్ మేనేజిమెంట్ 2

స్ట్రెస్ మేనేజిమెంట్ 3



మానవ సంబంధాలపై రామకృష్ణా మిషన్ లో ఇచ్చిన ప్రసంగం...

విజువలైజేషన్‌ టెక్నిక్‌


విజువల్‌ ఇమేజరీ :
మనం అనుకూలమైన, ప్రశాంతమైన చోటును ఎంచుకుందాం. కొద్దిసేపు మన ఇతర కార్యక్రమాలను పక్కన ఉంచుదాం. ఒక అరగంటసేపు ఆ ప్రదేశంలో ఏ రకమైన కాలింగ్‌ బెల్‌గాని, టెలిఫోన్‌గాని చిన్నపిల్లల ఆటస్థలంగాని వుండరాదు. మనం కూర్చోవచ్చు. లేదా పడుకోవచ్చు.
కళ్లు మూసుకుందాం.
మనం పూర్వంలో ఎంతో ఆనందంగా గడిసిన సంఘటనను వూహించుకుందాం. అది వ్యక్తితో కావచ్చు లేదా ఏదో ఒక ప్రదేశం కావచ్చు. మనకు ఏ రకంగా ఆనందం కలిగినా ఆ సంఘటనను మనం ఒక్కసారిగా ఊహించుకుందాం.

టెక్నిక్ - 2


ఆటో జెనిక్‌ ట్రైనింగ్‌
సెల్ఫ్‌ హిప్నోటిక్‌ ప్రొసిజర్‌
విశ్రాంతికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఈ విధానంలో ఎవరైనా కూర్చునిగాని, పడుకుని గాని ప్రాక్టీస్‌ చేయవచ్చు. మనకి ఏ పొజిషన్‌ అనుకూలంగా వుంటుందో గమనించండి. ఈ ప్రాక్టీసును చేసే వ్యక్తులు కళ్లు గట్టిగా మూసుకోవాలి. వీటిలో ప్రతిపాదించిన సజెషన్స్‌ను మానసికంగా గాని లేదా వీటిని ముందుగా రికార్డు చేసుకుని గాని వింటూ రిలాక్స్‌ కావాలి.

టెక్నిక్ - 1


ప్రోగ్రెసివ్‌ మస్క్యులర్‌ రిలాక్సేషన్‌
దైనందిన జీవితంలో రిలాక్సేషన్‌ భాగం కావాలి.  దానిమూలంగా మీలో వున్న అన్ని రకాల టెన్షన్లు తగ్గుముఖం పడతాయి. రిలాక్సేషన్‌ కోసం అనేక టెక్నిక్స్‌ ఉన్నాయి. ప్రోగ్రెసివ్‌ మస్క్యులర్‌ రిలాక్సేషన్‌ టెక్నిక్‌ను కనిపెట్టినవాడు ఎడ్మెండ్‌ జాకబ్‌సన్‌. అతని ప్రతిపాదించిన సిద్ధాంతానికి    మరికొంత మెరుగులు దిద్దిన రూపం ఇది. చదవండి.  ట్రైనింగ్‌ తీసుకోండి.  సాధన చేయండి. 

24 October 2012

టైప్‌ - బి

వ్యక్తిత్వ విశ్లేషణ
1. జీవితం అంటే కార్ల రేస్కాదు. జీవితం ఉన్నది కేవలం అనుభవించడానికి, ఆనందించడానికి.
2. జీవితం భోగ వస్తువు. సంతోషమే ప్రధానం. ఏదో ఘనత సాధించాలన్నది ధ్యేయం కాదు.
3. జీవితం సగటు కన్నా ఎక్కువగా ఉంటే చాలు. జీవితంలో ఏదో సాధించాలనే ఆవేదన, ఆశ ఉండదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. జీవితాన్ని కావాలని దు:ఖమయం చేసుకోరు.
4. వృత్తిపరంగా లభించిన విజయం చాలు. సంతృప్తి చెందుతారు. ఆనందమయ జీవులు. వీరు వృత్తి జీవితానికి చెందని విజయానికి, జీవితంలోని సుఖానికి గల బేలెన్సును చూస్తారు. సంతృప్తి చెందుతారు.
5. దేనిని గురించైనా అతిగా ఆలోచించరు. ఆవేదనకు గురి కారు. బ్రతికినంత కాలం ఆనందంగా బ్రతుకుదాం. కష్టాలను కొనితెచ్చుకోవడం వీరికి ఇష్టం ఉండదు.

టైప్‌ - ఎ

వ్యక్తిత్వ లక్షణాలు
1. ఎప్పుడూ, ప్రతి విషయంలో స్పీడు (హర్రీ)
2. ఖచ్చితంగా టైం పాటిస్తారు.
3. రోజుకి 24 గంటలు కాదు... 40 పనిగంటలు కావాలి.
4. పట్టుదల, అత్యాశ ఎక్కువ. జీవితం నుంచి చాలా ఆశిస్తారు. పొందిన దానితో ఎన్నడూ సంతృప్తి చెందరు.
5. పరిపూర్ణతను ఆశిస్తారు.

మీరు - మీ వ్యక్తిత్వం


ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తి స్రెస్కు లోనవుతూనే ఉంటారు. అయితే కొంతమంది వారి మానసిక శక్తి వల్ల ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. కొంతమంది చిన్న ఒత్తిడికే అప్సెట్అయిపోతూ ఉంటారు. స్ట్రెస్ను ఎదుర్కోవడంలో వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లకు, గుండెజబ్బులకు ఉన్న సంబంధంపై ఫ్రీడ్మెన్‌, రోస్మెన్అనే ఇద్దరు అమెరికన్కార్డియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేశారు.  
వీరు వ్యక్తులను టైప్-, టైప్-బిలుగా వర్గీకరించారు
 టైప్‌- పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు జీవితంలో విశ్రమించరు. ఎప్పుడూ వారికి తొందరే. అనేక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు జీవితంలో చాలా పెద్ద పనులు నెత్తిన పెట్టుకుంటారు. అపజయాన్ని అంగీకరించరు. కోపం ఎక్కువ. ఎప్పుడూ మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం గల వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది.
టైప్‌- బి పర్సనాలిటీ గల వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. విశ్రాంతికి ఎక్కువ విలువ ఇస్తారు. నిదానంగా ఆలోచిస్తారు. జరిగేది జరగక మానదు. నిదానంగా కారణాలు పరిశీలించాలంటారు. ఓటమిని అంగీకరిస్తారు. ఓర్పు, సహనంతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లో గుండెజబ్బులు వచ్చే శాతం చాలా తక్కువ అని తేలింది.

లక్షణాలు


ఒత్తిడి అందరికీ ఒకేలా ఉండదు. అది ఒక్కొక్కరిలో ఒక్కో రూపంలో బయటపడొచ్చు. ఒత్తిడి లక్షణాలు మనిషికీ మనిషికీ మారిపోతుంటాయి. మొత్తం మీద బాధితుల్లో 50 లక్షణాల్లో కొన్నైనా కనపడతాయని క్రోడీకరించారు పరిశోధకులు.
1. తరచూ తలనొప్పి, దవడల నొప్పులు
2. తెలియకుండానే పళ్లు నూరుతూ ఉండడం
3. మాట తడబడడం, నత్తి రావడం
4. పెదాలు, చేతులు వణకడం

ఉద్యోగులూ బహుపరాక్‌!


ఈనాటి లీడర్లపైనే రేపటి తరం ఆశ. ఉద్యోగుల ఒత్తిడికి గురయ్యే సాధారణ కారణాలు ఇలా ఉన్నాయి. ఈ క్రింది అంశాలు సాధారణంగా అందరిలోనూ ఒత్తిడికి కారణమవుతూ ఉంటాయి. వీటిలో మీకు చెందిన వాటిని టిక్చేయండి. సరి చేసుకోవడానికి, సమస్యను అధిగమించడానికి ప్రయత్నించండి.
1. పని ప్రదేశంలో....
పై అధికారితో సక్రమంగా లేని సంబంధాలు
పని ఒత్తిడి మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఉండడం.

ఒత్తిడి .... ఆరోగ్య ప్రభావాలు


స్పీడు యుగంలో ఒత్తిడి తప్పదు. అయితే వివిధ శరీర భాగాలపై ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మెదడు: ఒత్తిడి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగపరమైన బాధలు పెరుగుతాయి. నిద్రలేమి, తలనొప్పులు, ప్రవర్తనలో మార్పులు, చికాకు, ఆందోళన, డిప్రెషన్వంటివీ బయలుదేరుతాయి.
నోరు : నోట్లో పుళ్లు రావడం, తరచూ నోరు పొడారి పోవడం వంటివి చాలావరకూ ఒత్తిడి లక్షణాలే.
జుట్టు : ఎక్కువకాలం పాటు ఒత్తిడికి గురవుతూ ఉంటే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. కొన్ని రకాల బట్టతలలు కూడా వస్తాయి.

21 October 2012

దాంపత్యంలో....


సెక్స్పై ఒత్తిడి ప్రభావం 
మానసిక ఒత్తిడి వల్ల కోరిక తగ్గుతుంది. భారభర్తల సుఖసంసారానికి ఇది అవరోధం. స్త్రీలలో కూడా శృంగార జీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ప్రీమెన్స్ట్రువల్సిండ్రోమ్కల స్త్రీలలో ఒత్తిడి లక్షణాలు అధికంగా ఉంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలో సంతాన సాఫల్యతపై కూడా ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

మహిళల్లో మానసిక ఒత్తిడి ప్రభావం
ఒత్తిడికి ఆడామగా తేడాలుండవు. సాధారణ గృహిణి కంటే ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే సరైన టైంకి ఉద్యోగానికి వెళ్లాలి. దారిలో ట్రాఫిక్జామ్‌, ఈవ్టీజింగ్‌.... పనిచేసే చోట లింగవివక్ష, వేధింపులు, పనిభారం వీరిలో మానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దీనివల్ల తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతోనూ, భర్తతోనూ దగ్గరితనం లేకుండా పోతుంది. చాలామంది స్త్రీలలో కోపం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ టెన్షన్‌, నిద్రపట్టకపోవడం, పిల్లల పెంపకం గురించి ఆదుర్దా చెందడం వంటివి జరుగుతాయి.