24 October 2012

టైప్‌ - ఎ

వ్యక్తిత్వ లక్షణాలు
1. ఎప్పుడూ, ప్రతి విషయంలో స్పీడు (హర్రీ)
2. ఖచ్చితంగా టైం పాటిస్తారు.
3. రోజుకి 24 గంటలు కాదు... 40 పనిగంటలు కావాలి.
4. పట్టుదల, అత్యాశ ఎక్కువ. జీవితం నుంచి చాలా ఆశిస్తారు. పొందిన దానితో ఎన్నడూ సంతృప్తి చెందరు.
5. పరిపూర్ణతను ఆశిస్తారు.

6. సహజంగానే చంచల స్వభావులు. పాదరసం వంటివారు. కోపిష్టులు. వెంటనే మామూలుగా మారుతారు.
7. పని ఇతరులకు అప్పగించి, అనుక్షణం వారిని, వారు ఏం చేశారు..., ఎంతవరకూ వచ్చింది అని అడుగుతూ ఉంటారు.
8. సాధారణంగా ధూమపానం అలవాటుంటుంది. మద్యపానం అలవాటు ఉంటుంది. టీ, కాఫీ, పొగాకు నమలడం వంటి అలవాట్లు ఉంటాయి.
9. చాలామందికి లైంగిక వాంఛ ఉంటుంది. అవకాశం దొరికితే లైంగిక క్రియలో నిపుణులు.
10. అతి తెలివిగా ఉంటారు. సృజనాత్మకత ఎక్కువ. జీనియస్ల్లా ఉంటారు.
11. అనేక కొత్త విషయాలను కనిపెడతారు.
12. లీడర్లుగా ఉంటారు కాని, కార్యకర్తలుగా ఉండరు.
13. ఎంతో చలాకీగా ఉంటారు. ఇతరుల విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా సహించలేరు.
14. ఏకకాలంలో రెండు మూడు పనులను చేస్తారు. ఉదా : ఫోను మాట్లాడుతూనే, పేపర్ల మీద సంతకాలు చేస్తూ ఉంటారు. టీ తాగుతూ, స్మోక్చేస్తూ ఉంటారు.
15. విశ్రాంతి సమయంలో పిక్నిక్కు వెళ్లడం గాని, పార్టీలకు వెళ్లడం గాని చేయరు. అక్కడ ఏమీ తోచదు. ఒంటరితనం ఫీలవుతూ ఉంటారు.
16. విజయాలను పర్సంటేజీ లెక్కలతో కొలుస్తారు.
17. తమ చుట్టూ ఉన్నవాళ్లంతా తమలాగే ఉండాలని అనుకుంటారు.
18. విజయం తప్ప అపజయం అనేపేరు కూడా వినదలుచుకోరు. అపజయాలంటే జుగుప్స.
19. వ్యక్తిగతంగా మంచి అభిరుచులుంటాయి. అద్భుతాలంటే ఇష్టం. అరుదుగా లభించే వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు.
20. ఇటువంటి వారివల్లే దేశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
21. పోటీతత్వం. ఆటలోనైనా ఓటమిని సహించలేరు. గెలిచి తీరుతారు.
22. చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. నమ్మకస్తులు, సాధారణంగా బాధ్యత కలిగి ప్రవర్తిస్తారు.
23. ఓర్పు తక్కువ. క్షణంలో తత్వం పూర్తిగా మారిపోతుంది.
24. ఏదైనా వ్యవహారం అనుకూలంగా లేకపోతే చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు.


No comments:

Post a Comment