ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్
దైనందిన జీవితంలో రిలాక్సేషన్ భాగం కావాలి. దానిమూలంగా మీలో వున్న అన్ని రకాల టెన్షన్లు తగ్గుముఖం పడతాయి. రిలాక్సేషన్ కోసం అనేక టెక్నిక్స్ ఉన్నాయి. ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్ టెక్నిక్‌ను కనిపెట్టినవాడు ఎడ్మెండ్ జాకబ్‌సన్. అతని ప్రతిపాదించిన సిద్ధాంతానికి మరికొంత మెరుగులు దిద్దిన రూపం ఇది. చదవండి. ట్రైనింగ్ తీసుకోండి. సాధన చేయండి.
మీరు రిలాక్స్ కాబోయే రూం విశ్రాంతికి తగినదిగా ఉండాలి. మంచిగాలి, సరిపడేలా వెలుతురు ఉండాలి. ధ్వనికాలుష్యం ఉండకూడదు. వాలుకుర్చీ మీద, లేకపోతే చాపమీద కూర్చోవచ్చు. లేదా అనుకూలమైన నిటారుగా ఉండే కుర్చీమీద కూర్చోపెట్టి తలకింద దిండు వుంచాలి. దిండుకు తల ఆనించి రిలాక్స్ కావడానికి వీలుండాలి. లూజుగా ఉండే దుస్తులు ధరించండి. కాళ్లకు చెప్పులు వద్దు. కండరాలు రిలాక్సేషన్ చేసే సమయంలో కొన్ని కండరాలు గ్రూపుల మీద కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇందులో అయిదు భాగాలున్నాయి.
1. ఫోకస్ అంటే మనసును కండరాల సముదాయం మీద ఫోకస్ చేయడం.
2. కండరాల సముదాయాన్ని బిగపెట్టగలగాలి.
3. బిగపెట్టిన కండరాలను 5 నుంచి 7 సెకన్ల వరకూ ఒత్తిడిని అదే స్థితిలో ఉంచగలగాలి.
4. రిలీజ్ ` కండరాల సముదాయం మీద ఉంచిన ఒత్తిడిని రిలీజ్ చేయడం.
5. రిలాక్స్ ` టెన్షన్‌ను క్రమేపీ విడుదల చేయడం.
ఈ అయిదు భాగాలు ఒక సైకిల్ లాంటివి. ప్రతిసారీ ఇవి అమలు జరగాలి.