17 August 2013

తెలివితేటలు అందరికీ సమానమే!



తెలివితేటలు అందరికీ సమానమే!
మహామంత్రి తిమ్మరుసు అఖండ ప్రజ్ఞావంతుడు. విజయనగర సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంవైపు నడిపించిన ధీశాలి అతడు. అతని తెలివితేటలను గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పెనుగొండ పాలకుడైన సాళువ నరసింహరాయల మంత్రి చిట్టి గంగన శిష్యుడే తిమ్మరుసు.

విజయనగర రాజ్యానికి మహామంత్రి కాగలిగిన అర్హతను అతి చిన్న ప్రాయంలోనే నిరూపించుకున్నాడాయన. పలక మీద ఒక గీతను గీసి దీనిని చెరపకుండా పెద్దది చేయాలి అని పరీక్ష పెట్టాడు నరసింహరాయలు. పలక తీసుకుని రాజసైనికులు బయలుదేరారు. అప్పటికింకా విద్యార్ధి దశలోనే ఉన్న తిమ్మరుసు చిన్న చిట్కా చేశాడు.
పలక మీద ఉన్న గీత పక్కనే మరో పెద్దగీతను గీశాడు. అది చెరిపివేయాల్సిన అవసరం లేకుండానే చిన్న గీతగా మారిపోయింది. ఒక్క పరీక్ష అతన్ని మహామంత్రి పదవి వరించడానికి కారణం అయ్యింది. తిమ్మరుసు సలహామీదనే సాళువ నరసింహరాయలు విజయనగరం మీద దండయాత్ర చేసి ప్రౌఢదేవరాయలను ఓడిరచి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. సాళువ నరసింహ రాయల తర్వాత అనారోగ్యవంతుడైన అతని పెద్దకుమారుడు తిమ్మభూపాలుడు రాజయ్యాడు. తర్వాత తిమ్మరుసు తెలివితేటల వల్లనే కృష్ణదేవరాయలు విజయనగర పాలకుడయ్యాడు.
తిమ్మరుసు చాకచక్యం గురించి కాశీమజిలీ కథల్లో గమ్మత్తైన కథ ఉంటుంది. గజపతుల యువరాణి చిన్నాదేవిని వరించాడు రాయలు. ఆమె వద్దకు మారువేషాల్లో తిమ్మరుసు తీసుకుని వెళతాడు రాయలు. అక్కడ వీరు ఎవరైనదీ ఆమె గ్రహించలేక పోయింది. ద్వార బంధానికి తలుపులపైన కాళ్లు అడ్డంగా చాపి ఒక చాకలి వాణ్ణి నిలబడమన్నది.
చాకలి పక్కకు తొలగితే గానీ రాయలు, తిమ్మరుసు ముందుకు వెళ్లలేరు. వాడు కదలడు. ఉన్నదొక్కటే మార్గం. వాడి కాళ్లకిందనుంచి దూరిపోవడమే. కానీ పని చేయడానికి గౌరవానికి భంగం. అప్పుడు వెంటనే తిమ్మరుసు సమయస్ఫూర్తిని ఉపయోగించి, ‘దండాలండీ మడేలుగారూఅన్నాడు రెండు చేతులూ జోడిరచి. అంతపెద్దవాడు తనకు దండం పెడితే తాను తిరిగి పెట్టకపోతే బాగోదు కదా! దండాలండీ అన్నాడు వాడు వినయంగా ఒంగి నమస్కరించి. 

తెలివి ఒకరి సొత్తు కాదనీ, సమయం సందర్భంÑ అవకాశం, అవసరాన్ని బట్టి తెలివి బయటపడుతుందని భారతీయ సాంప్రదాయంలోని విశ్వాసం.
కానీ ఆధునికయుగంలో పాశ్చాత్యదేశాలలో తెలివితేటలను కొలిచేందుకు కొన్ని పరీక్షలను కనిపెట్టి వివిధ సందర్భాలలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వినియోగం, పరీక్షల విశ్వసనీయత తగ్గింది. ఇలాంటి తెలివితేటల పరీక్షల ఫలితాలను .క్యూ అని చెప్పడం జరుగుతోంది.
ఐక్యూ అంటే ఏమిటి?
.క్యూ అంటే (ఇంటిలిజెన్స్కోషియంట్‌) తెలివితేటల సూచిక అని అర్థం. తెలివి తేటలకు పరీక్ష పెట్టడం అనేది 20 శతాబ్దంలో ఫ్రాన్స్లో ప్రారంభమైంది. తెలివితేటల పరంగా పిల్లల్లో సాధారణ స్థాయి, తక్కువస్థాయి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు ఒక విధానాన్ని కనిపెట్టే ఉద్దేశ్యంతో  1904లో ఒక కమీషన్ఏర్పాటైంది. దీనికి మానసిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్బినెట్సారధ్యం వహించాడు. తక్కువస్థాయిలో తెలివితేటలు గల పిల్లల్ని ప్రత్యేక పాఠశాలల్లో చేర్చి వారిపట్ల వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ చూపేలా చేయడమే పరీక్ష ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బినెట్ఒక స్కేలును రూపొందించాడు. దీనికే బినెట్స్కేలు అని పేరు వచ్చింది. స్కేలును రూపొందించడంలో బినెట్కు సాయపడ్డ సైమన్పేరును చేర్చి, దీన్ని సైమన్బినెట్స్కేల్అని పిలవడం ఆరంభించారు.
తాను రూపొందించిన స్కేలును సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే, దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని బినెట్ముందుగానే హెచ్చరించాడు. ప్రత్యేక విద్య అవసరమైన విద్యార్ధులను గుర్తించేందుకు మాత్రమే తాను రూపొందించిన స్కేలు ఉపయోగపడుతుందని చెప్పాడు. అంతేతప్ప పిల్లల మానసిక సామర్ధ్యం ఆధారంగా విద్యార్ధులకు ర్యాంకింగ్లు ఇచ్చేందుకు వినియోగించరాదని బినెట్సూచించాడు. తాను రూపొందించిన స్కేలు వాస్తవానికి పిల్లల తెలివితేటలు లెక్కించేందుకు మాత్రం ఉపయోగపడదని తేల్చి చెప్పాడు. మేధోపరమైన లక్షణాలను ఒక భౌతిక కారకంలా లెక్కించే అవకాశం లేకపోవడం వల్ల, ఐక్యూని పిల్లల మేధస్సుకు గీటురాయిగా పేర్కొనడం తీవ్ర తప్పిదం అవుతుందని అభిప్రాయపడ్డారు. తరహా విధానం పిల్లల తెలివి తక్కువ తనాన్ని ఎత్తి చూపడంతో పాటు, పిల్లవాడు భవిష్యత్తులో ఎన్నో వ్యతిరేక ప్రభావాలకు గురి కావొచ్చని హెచ్చరించారు.
ఇంతకీ అసలు కొలిచేదేమిటి? ఐక్యూ పరీక్ష ఒక మనిషి తెలివితేటల స్థాయిని కొలుస్తుందనుకుంటే, అసలు తెలివితేటలు అంటే ఏమిటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. స్కూల్లో అన్నింటా బ్రహ్మాండంగా రాణించడమా తెలివితేటలంటే? చక్కగా చదవడం, కరెక్టుగా స్పెల్లింగ్పలకడమా... లేక మరేదైనానా? తెలివితేటలంటే ఇది అని సరిగ్గా ఇప్పటివరకూ ఎవరూ నిర్వచించ లేకపోయారు.
ఐక్యూలలో తేడాలు ఉంటే వారిలో ఒకరు బాగా తెలివైన వారని మరొకరు కారని నిర్ధారణ చేయవచ్చునా? అలా చేయనవసరం లేదు. తేడాలు వారి ఐక్యూలలో ఎందుకు ఏర్పడ్డాయో ముందుగా గమనించాలి.
తెలివైనవారు కూడా ఒక్కొక్క సమయంలో తడబడడానికి అవకాశం ఉంది. వారి పెర్ఫార్మెన్స్ను బట్టి మాత్రమే వారు తెలివైనవారు కారని నిర్ణయించకూడదు. తెలివితేటలకు వారి చర్యల పర్యవసానాలకు చాలా వ్యత్యాం ఉంటుంది. ఐక్యూలలో ఫెనోటైపిక్అని జెనోటైపిక్అని రెండు రకాలు ఉన్నాయి. ఫెనోటైపిక్అంటే దానిలోని టెస్ట్తెలిసిన సబ్జెక్టులపై ఆధారపడి ఉంటుంది. అది కేవలం వైజ్ఞానిక సంబంధమైనది. దానివల్ల నిజమైన తెలివితేటలు బయటపడడానికి గాని సృజనాత్మకమైన మేధస్సుకు సంబంధించినది కాకపోవచ్చు. ఫెనోటైపిక్ఐక్యూ వ్యక్తి యొక్క జినోటైపిక్ఐక్యూను బహిర్గతం చేయలేదు.
యదార్ధానికి వ్యక్తి మేధావే కావచ్చు. కాని అతని ఆచరణను బట్టి అతని మేధాశక్తి నిర్ణయం కాదు. దానికి శారీరక శక్తిపై పరీక్ష కూడా అవసరమై ఉంటుంది.
మీకు చాలా బలం ఉండవచ్చు. కాని హేమర్ను విసరటంలో కేవలం బలం మాత్రమే చాలదు. దానిని విసిరే ఒడుపు (టెక్నిక్‌) తెలియాలి. అనుభవం ఉండాలి. మీరు హేమర్ను విసరలేక పోవడానికి మీ జబ్బలలో సత్తువ లేకపోయి ఉండవచ్చు. పబ్లిక్లో విసరడం కొత్త కావడం వల్ల భయపడి ఉండవచ్చు. మీరు బాగా విసరడానికి వీలులేదని ఎవరైనా మిమ్మల్ని భయపెట్టవచ్చు. లేదా డబ్బుచూపి ప్రలోభపరచవచ్చు. కనుక మీరు సరిగ్గా విసరలేకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఫెనోటైపిక్ఐక్యూ టెస్టులు మీ మేధాశక్తికి సరైనవని చెప్పడానికి వీలులేదు. మీకు చేయగల శక్తి ఉండవచ్చు. కాని మీరు సరిగ్గా చేయలేకపోవచ్చు. దీనికి పరిసర వాతావరణం కూడా ఒక కారణం కావచ్చు. అంతఃప్రేరణా లోపం కావచ్చు.
ఐక్యూ టెస్టులు మన పూర్తి మేధస్సుకు కొలబద్దలు కావు.  ఐక్యూలు పరిశీలించేటప్పుడు వ్యక్తుల కుల, మతాల ప్రభావం కూడా వారిమీద పడుతుంది. బీదరికం యొక్క ప్రభావం ఐక్యూ మీద ఉంటుందని పరిశోధనలు బహిర్గతం చేశాయి. అంతేకాదు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబంలోని పిల్లల ఐక్యూలో తేడా ఉంటుంది.

2 comments:

  1. అభినందనలు.
    మంచి వ్యాసం ఇచ్చారు.

    ReplyDelete
  2. యువతకు ఉపయోగపడే మేలిమి బంగారు వాక్యాలు అందించారు... ధన్యవాదాలు....

    ReplyDelete