15 May 2013

కృషి, ప్రపంచజ్ఞానం విజయానికి మార్గాలు

ప్రపంచంలోని మొట్టమొదటి రైలు వంతెన, ఇప్పటికీ వాడుకలో ఉన్నది ఏదో తెలుసా? నయాగరా జలపాతంపై కట్టిన సస్పెన్షన్బ్రిడ్జి. దీన్ని 1848 నుంచి 1897 మధ్యకాలంలో నిర్మించారు. కెనడా అమెరికా దేశాల మధ్య ఉన్న నయాగరా జలపాతం 825 అడుగుల మేరకు విస్తరించి ఉంటుంది. అంటే నాలుగు కిలోమీటర్ల దూరం. ఇంత పొడవైన మార్గానికి కాలంలో రైల్వేవంతెన నిర్మించడం సామాన్యమైన విషయమేమీ కాదు.


దానికి తోడు రెండు దేశాలను కలుపుతూ ఉండే నయాగరాపై వంతెనకు రాజకీయ అడ్డంకులు కూడా చాలా వచ్చాయి. కెనడా రాజకీయవేత్త విలియం హామిల్టన్మెరిట్చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాడు. ఇరుదేశాలలోని సివిల్ఇంజినీర్లను చర్చలకు పిలిచాడు. సమస్యలన్నీ తీరిన తర్వాత అసలు ఇంతదూరం వంతెన నిర్మిస్తే దానిమీద రైలు నడపడం సాధ్యమేనా అనే అనుమానం చాలామందికి వచ్చింది.
అప్పుడు అద్భుతమైన నిర్మాణ పథకం చెప్పడం ద్వారా చార్లెస్ఇలెట్జూనియర్అనే ఇంజినీర్ వంతెన కాంట్రాక్టును దక్కించుకోగలిగాడు. అతను తన పథకం ప్రకారం ఇరుదేశాలలోని యువకులకు గాలిపటాల పోటీని నిర్వహించాడు. నయాగరా జలపాతానికి అటువైపు వరకు ఎవరైతే గాలిపటాన్ని ఎగరేస్తారో వారే విజేత అని ప్రకటించాడు.
కొంతకాలానికి అతని కృషి ఫలించింది. నాలుగు కిలోమీటర్ల దూరానికి గాలిపటాలు ఎగిరాయి. ఎగురుతున్న గాలిపటాలకు మరికొంత బలమైన తాళ్లను కట్టి అవతలి పక్కకు పంపించాడు. దానితో ఒక రోప్వే లాంటిది తయారు చేశాడు. దానపైనే వంతెన నిర్మాణానికి అవసరమైన కలప, సున్నపురాయి, ముడిఇనుము వంటివాటిని తరలించాలని ఇంజినీర్ఆలోచన. కానీ దురదృష్టవశాత్తూ ఆర్ధికపరమైన తగాదాలతో ప్రాజెక్టు అటకెక్కింది.
మూడు సంవత్సరాల వరకూ అతను నిర్మించిన రోప్వే అలాగే ఉంది. చివరకు అతను చూపించిన మార్గంలోనే మరికొందరు ఇంజినీర్లు కలిసి వంతెన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇప్పటికీ నిక్షేపంగా దీనిపైనుంచి రైళ్లు వెళుతున్నాయి.

కష్టపడి ఏదైనా ఫలితం సాధిస్తే దానికుండే విలువ, ఆనందం చెప్పనలవి కాదు. ఎవరో కష్టపడితే దాని ఫలితాన్ని మనం పొందితే దానిలో థ్రిల్ఉండదు. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే అందులో ఉండే ఆనందము, సుఖము అంతస్తుల్లో ఉన్న అద్దె ఇళ్లలో ఉండదు. అందుకే స్వంత ఇల్లు అన్నది స్వంత కృషితో, స్వంత సంపాదనతో లభించిన స్వార్జితపు ఆస్తి. దానిలోని విలువ అపారం.
ఇక్కడ సోమర్సెట్మామ్అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత చెప్పిన చిన్న ఉదాహరణను మీకు తెలుపుతాను. ఆయనది వర్జెర్‌’ అనే చిన్న కథానికను రాశాడు. కథలోజాన్స్మిత్‌’ అనే అతను చర్చిలో ఒక వర్జెర్గా నియమించబడ్డాడు. వర్జెర్అంటే చర్చిలో ఉండే ఒక ఉద్యోగి. అతని పని చర్చికి వచ్చే వారికి వారివారి సీట్లు వారికి చూపడం. అది చాలా తేలికైన పని.
అతను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకి, ఒకరోజున చర్చి పాస్టర్ఒక ఉత్తర్వును జారీ చేస్తూ అక్కడ చర్చిలో ప్రతి ఉద్యోగి విద్యావంతుడై ఉండాలి అని తెలియపరిచాడు. ఒకవేళ ఎవరైనా విద్యావంతులు కాని ఎడల ఫలానా తేదీలోగా వారు అర్హతను పొందాలి అని ఉదహరించారు.
గడువు పూర్తయింది. పాస్టర్జాన్స్మిత్కు కబురు పంపించాడు. స్మిత్వచ్చాడు. నీవు విద్యార్హతను పొందావా? అని ప్రశ్నించాడు. స్మిత్లేదని సమాధానమిచ్చాడు. వెంటనే పాస్టర్అతనిని ఉద్యోగంలోంచి బర్తరఫ్చేశాడు. అతనికి ఇవ్వవలసిన జీతం, భత్యాలు ఇచ్చివేశాడు.
చేతిలో పడిన డబ్బుతో రోడ్డున పడ్డాడు స్మిత్‌. అతనికి చదువు లేదు. చేస్తున్న ఉద్యోగం కాస్తా ఊడిరది. నిజంగా ఆరోజు చాలా గడ్డురోజు. స్మిత్కి సిగరెట్కాల్చాలనిపించింది. దగ్గరలో సిగరెట్టు అమ్మేకొట్టులేదు. ఎంత ప్రయత్నించినా అతనికి కావాల్సిన సిగరెట్దొరకలేదు.
అప్పుడతనికి అనిపించింది. తానేకాదు... సిగరెట్టు కోసం తపించిపోయే వారెందరో ఉన్నారని, వెంటనే అతను తనవద్ద ఉన్న స్వల్ప పైకంతో సిగరెట్టు దుకాణాన్ని ప్రారంభించాడు. అతి త్వరితగతిని లండన్నగరం యావత్తు ప్రతి వీధిలోనూ ఒక్కో సిగరెట్టు దుకాణం పెట్టే స్థాయికి ఎదిగాడతను. 
కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజున స్మిత్ను అక్కడ ఉన్న బ్యాంకు మేనేజర్పిలిపించి బ్యాంకులో నీ అక్కౌంట్ఎంత ఉందో తెలుసా? అని అడిగాడు. చెప్పండి అన్నాడు స్మిత్‌. నువ్వు ఊహించలేనంతగా పెరిగింది. సొమ్మును నేను చెప్పినరీతిలో వినియోగించు అని సలహా ఇచ్చాడు. అయినా నీకున్న బ్యాంకు నిల్వలను గురించి నీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నామే గమనించలేదా అని మేనేజర్అడిగాడు. ఏవో కాగితాలు నాకు అందుతున్నాయి కాని అందులో ఏముందో నాకు అర్ధం కావడం లేదు అన్నాడు స్మిత్‌.
ఆమాట విన్న మేనేజర్విస్మయం చెందాడు. స్మిత్‌! నువ్వు చదువుకోకపోవడం వల్ల వచ్చిన అనర్ధం ఇది... నువ్వే గనుక చదువుకుని ఉంటే ఎంత గొప్పవాడివయ్యే వాడివో తెలుసా? అని ఆగాడు. తెలుసు... చర్చిలో ఒక వర్జెర్అయ్యేవాడిని అని సమాధానం చెప్పాడు స్మిత్‌.
మనిషికి చదువుకన్నా ముఖ్యంగా కావలసింది ప్రపంచజ్ఞానం, బ్రతుకుతెరువు తెలుసుకోవడం. కోట్లార్జించిన వారంతా విద్యావంతులా? విజ్ఞానవంతులా? మేధావులా? ఎన్ని యూనివర్సిటీ డిగ్రీలున్నా ప్రపంచంలో బతికేతీరు తెలియకపోతే వృధా. వారు కేవలం డిగ్రీలున్న మేధావులు మాత్రమే. ప్రపంచజ్ఞానం ఉంటే జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. విజయాన్ని సాధించవచ్చు.
కామన్సెన్స్ఈజ్నాట్సో కామన్‌.
జర్మన్జనరల్ఫీల్డు మార్షల్మాంటిగెమరీ అనే మిలటరీ జనరల్తాను రాసిన మెమొయర్స్అనే గ్రంధంలో ఇలా పేర్కొన్నాడు. నేను నా సైన్యాన్ని నాలుగు తరగతులుగా విభజిస్తాను. తెలివైనవారు, తెలివితక్కువ వారు, శ్రమచేసేవారు, మెతకగా ఉండేవారు. ప్రతి మిలటరీ ఆఫీసర్కు వీటిలో రెండో తప్పక ఉంటాయి. శ్రమ చేయగలిగి తెలివితేటలు కలిగిన వారిని పైపదవులకు వినియోగిస్తాను. తెలివితక్కువ వారిని, మెతకగా ఉన్న బద్ధకస్తులని ఇతర పనులకు వినియోగిస్తాను. బాగా తెలివితేటలుండి, బద్ధకం ఉన్న వారిని అత్యంత కీలకస్థానంలో ఉంచుతాను. ఎందుకంటే అలాంటి వారికి బుద్ధిబలంతో పాటు, గుండెధైర్యం కూడా ఉంటుంది. కాని అతి చురుకుగా ఉన్న మూర్ఖుణ్ణి వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తాను.
అర్ధం చేసుకోలేకపోతేనే తగాదాలు వస్తాయి. సక్రమంగా అర్ధం చేసుకుంటే అసలు తగాదాలే ఉండవు. ప్రతి తగాదా తీసుకోండి. ఇరుపక్షాల వారుకూడా సగం రైటుగానూ మరోసగం రాంగ్గానూ ఉంటారు. రెండిరటినీ సమన్వయ పరచగలిగితే తగాదాలే ఉండవు. ప్రతివారూ తాము సంపూర్ణంగా రైటు అని, అవతలివారు సంపూర్ణంగా రాంగ్అనే భావన  తగాదాలు ఏర్పడే అవకాశమే ఉండదు. అయితే మూర్ఖపు పట్టుదలలకు పోతే మాత్రం చెప్పలేం.
కొందరు ప్రతి చిన్న విషయాలకు తల్లుల మీద, తండ్రుల మీద, దేవుళ్ల మీద ఒట్లు పెట్టేస్తుంటారు. అది అసమర్ధతకు లక్షణం. అవివేకం, అనుచితం, అసందర్భం.
సంస్కారం మనలో ఉన్నప్పుడు మన మాటలు కూడా సంస్కారవంతంగానే వెలువడతాయి. మన మాటలని, చేతలని అతి జాగ్రత్తగా చూసుకుంటాం. మనలో ప్రతి ఒక్కరు మాటలలో, చేతలలో కూడా జాగ్రత్త వహిస్తారు.

No comments:

Post a Comment