24 October 2012

ఉద్యోగులూ బహుపరాక్‌!


ఈనాటి లీడర్లపైనే రేపటి తరం ఆశ. ఉద్యోగుల ఒత్తిడికి గురయ్యే సాధారణ కారణాలు ఇలా ఉన్నాయి. ఈ క్రింది అంశాలు సాధారణంగా అందరిలోనూ ఒత్తిడికి కారణమవుతూ ఉంటాయి. వీటిలో మీకు చెందిన వాటిని టిక్చేయండి. సరి చేసుకోవడానికి, సమస్యను అధిగమించడానికి ప్రయత్నించండి.
1. పని ప్రదేశంలో....
పై అధికారితో సక్రమంగా లేని సంబంధాలు
పని ఒత్తిడి మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఉండడం.

సమయాన్ని గురించిన ఒత్తిడులు, డెడ్లైన్లు, ఆగమేఘాలపై పనులు పూర్తిచేయాల్సి రావడం
దిశానిర్దేశకత్వం లేకపోవడం, ఉదాహరణకు మీ బాధ్యతలేమిటో, మీనుంచి ఏమి ఆశిస్తున్నారో తెలియకపోవడం
ఆశిస్తున్న పనితీరు, విలువలు, ప్రమాణాలు, వ్యక్తిత్వాలకు సంబంధించిన వైరుధ్యాలు
కంపెనీ యొక్క భవిష్యత్తు లేదా వ్యక్తిగత కెరీర్విషయంలో అనిశ్చితి
పనితీరును గురించి ప్రతిస్పందన తెలియకపోవడం
సపోర్ట్లేకపోవడం
కమ్యూనికేషన్లేకపోవడం
అర్ధవంతమైన భాగస్వామ్యం కలిగివుండేలా పని పూర్తి చేయాలనే స్పృహలేకపోవడం
స్థాయిని తగ్గించడం, సరైన పనిని మీనుంచి పొందకపోవడం, తిట్టడం
ఎక్కువ ఉత్పాదకత సాధించాలని డిమాండ్చేయడం
కూర్చునేందుకు సరైన ప్రదేశం కేటాయించకపోవడం, పరికరాలు ఇవ్వకపోవడం
పని తప్ప వేరే ఏదీ పట్టించుకోని బాస్లు, టైప్‌ ` బాస్లు
మీటింగులు
మతిపోగొట్టే రొద
వ్యక్తిగత పనితీరు మందగించడం
పని ఓవర్లోడ్కావడం
కొత్త బాధ్యతలు అప్పచెప్పడం
బడ్జెట్కోతలు విధించడం
వేతనం తగ్గించడం
మీ జట్టులోని ఇతరులు సమర్ధవంతమైన పనిని అందించకపోవడం
పోటీని పెంచుతూ పోవడం
ప్రభుత్వ నియంత్రణలు
మార్పు
వ్యవస్థలోని మార్పులు
పోటీతత్వం లేని పనిచేసే ఉత్సాహం లేని కొలీగ్లు
తక్కువమంది ఉద్యోగులు
వ్యాపారంలో ఊహించని పెరుగుదల లేదా వైఫల్యం
వేగాన్ని గురించి, నాణ్యతను గురించి, సంఖ్యను గురించి ఒత్తిడి చేయడం

2. కుటుంబ పరమైన కారణాలు
సంతృప్తికరంగా లేని బాంధవ్యాలు
కమ్యూనికేట్చేయడంలో సమస్యలు
కుటుంబంతో గడపడానికి సమయం లేకపోవడం
కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం
కుటుంబ సభ్యులలో ఎవరైనా డ్రగ్లేదా ఆల్కహాల్కు బానిసలు కావడం
వైవాహిక జీవితంలో సమస్యలు, భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం, పునర్వివాహం
కుటుంబ సభ్యులలో ఎవరికైనా సామాజికంగా, విద్యాపరంగా సమస్య ఉండడం
కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోవడం
ఇల్లు మారడం
ఆర్ధిక సమస్యలు
వైకల్యం లేదా సంతానలేమి

3. వ్యక్తిగత కారణాలు
ఆత్మగౌరవం లేకపోవడం
నెగెటివ్ఆలోచనా ధోరణి
విసుగుదలను అణుచుకునే శక్తి తక్కువగా ఉండడం
ఎమోషన్లను కంట్రోల్చేసుకునే శక్తి లేకపోవడం (అతిగా ఆవేశపడిపోవడం లేదా అసలు చెప్పకపోవడం)
అధికమైన పోటీతత్వం
పెర్ఫెక్షనిజమ్
ఆరోగ్య సమస్యలు
డ్రగ్లేదా ఆల్కహాల్కు బానిసలు కావడం
వ్యక్తిగత విలువల విషయంలో క్లియర్గా లేకపోవడం, సుదీర్ఘకాలం పట్టే లక్ష్యాలు, ప్రణాళికలు
పెద్దవైన అసంతృప్తులను సరిపెట్టుకోవడంలో ఇబ్బంది
ఖచ్చితత్వం లేకపోవడం
ఇతరులను అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది

No comments:

Post a Comment