24 October 2012

మీరు - మీ వ్యక్తిత్వం


ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తి స్రెస్కు లోనవుతూనే ఉంటారు. అయితే కొంతమంది వారి మానసిక శక్తి వల్ల ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. కొంతమంది చిన్న ఒత్తిడికే అప్సెట్అయిపోతూ ఉంటారు. స్ట్రెస్ను ఎదుర్కోవడంలో వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లకు, గుండెజబ్బులకు ఉన్న సంబంధంపై ఫ్రీడ్మెన్‌, రోస్మెన్అనే ఇద్దరు అమెరికన్కార్డియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేశారు.  
వీరు వ్యక్తులను టైప్-, టైప్-బిలుగా వర్గీకరించారు
 టైప్‌- పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు జీవితంలో విశ్రమించరు. ఎప్పుడూ వారికి తొందరే. అనేక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు జీవితంలో చాలా పెద్ద పనులు నెత్తిన పెట్టుకుంటారు. అపజయాన్ని అంగీకరించరు. కోపం ఎక్కువ. ఎప్పుడూ మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం గల వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది.
టైప్‌- బి పర్సనాలిటీ గల వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. విశ్రాంతికి ఎక్కువ విలువ ఇస్తారు. నిదానంగా ఆలోచిస్తారు. జరిగేది జరగక మానదు. నిదానంగా కారణాలు పరిశీలించాలంటారు. ఓటమిని అంగీకరిస్తారు. ఓర్పు, సహనంతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లో గుండెజబ్బులు వచ్చే శాతం చాలా తక్కువ అని తేలింది.

No comments:

Post a Comment