27 October 2012

విజువలైజేషన్‌ టెక్నిక్‌


విజువల్‌ ఇమేజరీ :
మనం అనుకూలమైన, ప్రశాంతమైన చోటును ఎంచుకుందాం. కొద్దిసేపు మన ఇతర కార్యక్రమాలను పక్కన ఉంచుదాం. ఒక అరగంటసేపు ఆ ప్రదేశంలో ఏ రకమైన కాలింగ్‌ బెల్‌గాని, టెలిఫోన్‌గాని చిన్నపిల్లల ఆటస్థలంగాని వుండరాదు. మనం కూర్చోవచ్చు. లేదా పడుకోవచ్చు.
కళ్లు మూసుకుందాం.
మనం పూర్వంలో ఎంతో ఆనందంగా గడిసిన సంఘటనను వూహించుకుందాం. అది వ్యక్తితో కావచ్చు లేదా ఏదో ఒక ప్రదేశం కావచ్చు. మనకు ఏ రకంగా ఆనందం కలిగినా ఆ సంఘటనను మనం ఒక్కసారిగా ఊహించుకుందాం.

మిగతా విషయాలన్నీ మరిచిపోయి, ఆ ఒక్క సంఘటనే వూహించుకోండి.
ఆ ఊహాలోకంలోనే పదినిమిషాలపాటు వుండండి.
తరువాత మీరు ఇంతవరకు అనుభవించినవి అనుభవించే అవకాశం లేనివి కాని మనకు అత్యంత ఆనందాన్ని కలిగించేవి వూహించండి.
ఆ సంఘటనలో వున్నట్లుగా, అనుభవిస్తున్నట్లుగా మానసికంగా వూహించండి.
ఈ భావనతో ఒక పదినిమిషాల పాటు వుండండి.
ఇప్పుడు కళ్లు తెరవండి. రిలాక్స్‌డ్‌గా ఫీలవండి. మీరు ఊహించిన అనుభూతిని రీచార్జి చేస్తూ వూహించండి.
విజువలైజేషన్‌ టెక్నిక్‌
మిమ్మల్ని ఎవ్వరూ డిస్ట్రబ్‌ చేయని రూంలో రిలాక్స్‌ అవడానికి రెడీ అవండి. రూం వాతావరణం రిలాక్సేషన్‌కు అనుకూలంగా ఉండాలి. గదిలో దోమలు లేకుండా ఉండాలి. లైట్‌ డల్‌గా వుండాలి. ఫ్రెష్‌గా గాలి వీస్తుండాలి. టెలిఫోన్‌ 20 నిముషాలు డిస్ట్రబ్‌ చేయకుండా చూసుకోవాలి. మీరు లూజుగా ఉన్న దుస్తులు ధరించాలి. బెల్ట్‌లూజ్‌ చేయాలి. కళ్ల అద్దాలు వుండకూడదు. ఆ తరువాత బెడ్‌పై కాని, చాపమీద కాని, ఈజీచైర్‌లో కాని వెల్లకిలా పడుకోవాలి. కళ్లు మూసుకోండి. బాగా గాలి పీల్చండి. కొద్ది సెకన్లు నిలిపి మళ్లి నిదానంగా గాలి వదలండి. గాలి వదిలుతున్నప్పుడు రిలాక్స్‌గా ఫీల్‌ అవండి. ఇలా ఇరవైసార్లు గాలి పీల్చి వదులుతుండండి. మొదట్లో మీకు రకరకాల ఆలోచనలు చాలా స్పీడ్‌గా వస్తూ పోతుంటాయి. క్రమంగా మీరు రిలాక్స్‌ అవుతున్న కొద్దీ ఆలోచనల ఉధృతం తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఇష్టమైన ఓ ప్రకృతి దృశ్యాన్ని ఊహించాలి.
ఉదయించే సూర్యుడ్ని మనసులో ఊహించుకోండి. మొదట్లో మీకు క్లియర్‌గా కనిపించకపోయినా, క్రమంగా మీరు డెవలప్‌ చేయగలుగుతారు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అప్పటి వాతావరణం గమనించండి. కొండలు, చెట్లు, ఆకాశం, కొండలపై భాగం నుంచి సూర్యుడు ఉదయిస్తుంటే ఆ కిరణాలు వాటి రంగు గమనించండి. చెట్లపై పక్షుల కిలకిల ధ్వనులు ఆలకించండి. రకరకాల పక్షులు అటూ ఇటూ రెక్కలు విప్పుకుని ఎగురుతున్నట్లు ` ఇలా ఓ పది నిమిషాలు ఆ సుందరమైన దృశ్యాల్ని ఊహించండి. ఇలా ఊహిస్తున్నప్పుడు మీలో ఉన్న టెన్షన్‌ క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. మీరు ప్రశాంతతకు లోనవుతుంటారు. అలా ఓ పదినిమిషాలు అయిన తరువాత మీ మనసును మీ శరీర భాగాలపై కేంద్రీకరించండి. మీ శరీరం బాగా విశ్రాంతి స్థితిలో వుందన్న విషయాన్ని గమనించండి. ప్రతిభాగాన్ని మనస్సులో గమనించండి. ప్రతిభాగం గమనిస్తున్నప్పుడు ఆ భాగం బాగా రిలాక్స్‌ అయినట్లు ఫీల్‌ అవ్వండి. ఆ తరువాత ఓ ఐదు నిమిషాలపాటు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. తరువాత ఈ క్రింది సజెషన్స్‌ అనుకోండి.
‘‘నేను బాగా రిలాక్స్‌ అయ్యాను.’’
‘‘ఇప్పుడు నాకు శారీరకంగా ` మానసికంగా చాలా హాయిగా వుంది.’’
‘‘రోజురోజుకి ఇంకా ప్రశాంతత పొందుతాను.’’
ఒక్కొక్క సజెషన్‌ 3 సార్లు రిపీట్‌ చేయాలి. ఆ తరువాత 2`3 నిమిషాలు రెస్ట్‌ తీసుకుని ఒకటి నుంచి పది అంకెలు లెక్కపట్టుకుని కళ్లు తెరవవచ్చు. ఆ తరువాత చల్లనీళ్లతో ముఖం కడుక్కుని ఫ్రెష్‌గా ఫీల్‌ అవండి. ఇలా కొద్ది రోజుల్లో మీరు మానసిక ఒత్తిడి నుంచి మానసిక విముక్తి పొందగలుగుతారు.

క్రియేటింగ్‌ యువర్‌ స్పెషల్‌ ప్లేస్‌
మీరు రిలాక్స్‌ కావాలనుకున్నప్పుడు ఓ ఇరవై నిమిషాలపాటు మీరు చేస్తున్న పనులు ఆపండి. రిలాక్సేషన్‌ పొందడానికి మీరు ప్రత్యేకంగా ఓ రూం చూసుకోండి. లేదా మీరు ఉన్న రూంలోనే రిలాక్స్‌ అయ్యేందుకు అవకాశం ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ డిస్ట్రబ్‌ చేయవద్దని రిలాక్స్‌ చెప్పి రిలాక్స్‌ అవడానికి ఉపక్రమించండి.
ఈజీ చైర్‌లోగాని మీకు అనువుగా వున్న ప్లేస్‌లో రిలాక్స్‌డ్‌గా పొజిషన్‌లో కూర్చోండి లేదా పడుకోండి. కళ్లు మూసుకుని ఈ ఇరవై నిమిషాల ఎక్సర్‌సైజ్‌ చేయాలి.
ఈ ఎక్సర్‌సైజ్‌ ప్రత్యేకత ఏమంటే మీరు మీకిష్టమైన మీ పర్సనల్‌ ప్లేస్‌ను ఊహించుకోవడం. కొంతమందికి గార్డెన్‌ అంటే ఇష్టమైతే మరి కొంతమంది సముద్రపు పరిసరాలు ప్రాంతం ఇష్టపడతారు. ఇంకొంతమందికి వర్షపు జల్లులు పడుతుంటే ఇష్టముంటుంది. ఇంకొంతమందికి వారికి ఇష్టమైన మ్యూజిక్‌ వింటూ రిలాక్స్‌ అవ్వాలనిపిస్తుంది.
ఇలా మీకు ఏది ఇష్టమో స్పష్టంగా ముందుగా మీరు ఆ ప్లేస్‌ను గురించి పూర్తిగా ఒక ఊహను రూపొందించుకోవాలి.
ఉదాహరణకు ఒక పద్ధతిని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. కళ్లు మూసుకోండి. ఓ పదిసార్లు బాగా గాలిపీల్చి వదలండి. అలాగే ప్రశాంతంగా ఉండండి. మీకు ఆలోచనలలో తేడా తెలుస్తుంది. అంటే మీ ఆలోచనలు క్రమంగా తగ్గుతుంటాయి. ఇక మీ ఊహలు ఇలా సాగుతుంటాయి. చక్కటి అందమైన పొలాలు, ఆ పంటపొలాల నుంచి చల్లటి గాలులు వీస్తుంటాయి. దూరంగా కొండలు ఆ కొండలపై నుంచి తెల్లటి ఆవులు ఇంటి ముఖం పడుతూ క్రిందకు దిగుతుంటాయి. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయం కొండల వెనుక నుంచి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆకాశం చాలా ప్రశాంతంగా వుంటుంది.
మీరు ఆ పొలాల గట్లపై అటూ ఇటూ తిరుగుతుంటారు. ఆ చెట్ల కదలికలు గమనిస్తుంటారు.
పక్షుల కిలకిలలు, చిన్నచిన్న పిల్లకాలువలు వాటి శబ్దం, నీటిలో ఆకులు కొట్టుకు పోతుంటాయి.
మీరు అందమైన అనుభూతిని పొందుతుంటారు. ఇక చాలా చీకటి పడుతుంది. మీరు వెనుతిరిగి ఇంటికి వచ్చేస్తారు.
ఇలా ఊహించుకుని కాసేపు అదే పొజిషన్‌లో విశ్రాంతిగా పడుకోండి. మీరు ఇక లేవాలి అనిపించినప్పుడు మీరు సెల్ఫ్‌ సజెషన్స్‌ ఇచ్చుకోవాలి. ఇలా `
‘‘ఇప్పుడు నేను బాగా రిలాక్స్‌ అయ్యాను.’’
నా శరీరం, మనసు చూపు ప్రశాంతంగా హాయిగా వుంది. నేను కావాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా రిలాక్సేషన్‌ పొందగలను. సజెషన్స్‌ ఒక్కొక్కటి మూడుసార్లు రిపీట్‌ చేయండి.
ఆ తరువాత రెండు, మూడు నిమిషాలు రెస్ట్‌ తీసుకుని 10 నుంచి 1 వరకూ అంకెలు లెక్కపెట్టుకుంటూ నిదానంగా కళ్లు తెరవండి. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని ఫ్రెష్‌గా ఫీల్‌ అవండి.

No comments:

Post a Comment