24 October 2012

ఒత్తిడి .... ఆరోగ్య ప్రభావాలు


స్పీడు యుగంలో ఒత్తిడి తప్పదు. అయితే వివిధ శరీర భాగాలపై ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మెదడు: ఒత్తిడి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగపరమైన బాధలు పెరుగుతాయి. నిద్రలేమి, తలనొప్పులు, ప్రవర్తనలో మార్పులు, చికాకు, ఆందోళన, డిప్రెషన్వంటివీ బయలుదేరుతాయి.
నోరు : నోట్లో పుళ్లు రావడం, తరచూ నోరు పొడారి పోవడం వంటివి చాలావరకూ ఒత్తిడి లక్షణాలే.
జుట్టు : ఎక్కువకాలం పాటు ఒత్తిడికి గురవుతూ ఉంటే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. కొన్ని రకాల బట్టతలలు కూడా వస్తాయి.

గుండె : రక్తపోటు రావడం ఒత్తిడి ప్రభావమే. గుండె పనితీరుపై ఒత్తిడి ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురికావడం వల్ల హైబీపీ, గుండె దడ, గుండెపోటు వంటి రకరకాల బాధలు చుట్టుముడతాయి.
ఊపిరితిత్తులు : శ్వాసభారంగానూ, వేగంగానూ తయారవుతుంది. దీంతో కొందరిలో భయాందోళనలు పెరుగుతాయి. ఆస్త్మా బాధలు ఉధృతమవుతాయి.
పునరుత్పత్తి : తీవ్రమైన ఒత్తిడి స్త్రీలలో రుతుక్రమాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. నెలసరి బాధాకరంగా తయారువుతుంది. తరచూ యోని ఇన్ఫెక్షన్ల వంటివీ బాధిస్తాయి. పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి పురుష హార్మోన్టెస్టోస్టిరాన్ను దెబ్బ తీస్తుంది. దీంతో శుక్రకణాలు తగ్గి సంతాన రాహిత్యానికి దారి తీయవచ్చు. స్త్రీ పురుషులిద్దరిలోనూ లైంగిక వాంఛలు తగ్గి, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది.
జీర్ణం : మన పేగులు మరో మెదడు లాంటివి. ఇవి కూడా మానసిక ఒత్తిడికి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఫలితంగా కడుపులో మంట, అజీర్ణం, జీర్ణాశయంలో పుళ్లు (అల్సర్లు) కడుపులో గడబిడతో విరేచనాలు లేదా తీవ్ర మలబద్ధకం వంటివన్నీ మొదలవుతాయి.
రోగనిరోధక వ్యవస్థ : ఒంట్లో ఒత్తిడి పెరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిపోతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. జలుబు నుంచి ఫగ్ఇన్ఫెక్షన్ల వరకూ చాలా వెంటాడతాయి. మనలోని రోగనిరోధక వ్యవస్థ శరీరం మీదే దాడి చేస్తుండేరుమటాయిడ్ఆర్థరైటిస్‌’ వంటి వ్యాధులకూ ఒత్తిడి దోహదం చేస్తుంది.
కండరాలు : ఒత్తిడి కారణంగా కండరాలు బిగుసుకుంటాయి. దీనివల్ల మెడనొప్పులు, భుజం నొప్పులు, నడుం నొప్పులు, మొత్తం మీద ఒళ్లు నొప్పుల వంటివి తరచూ వేధిస్తుంటాయి.
ఎడ్రినల్గ్రంధి : ఎడ్రినల్ఎంజైములు అధికంగా రక్తప్రసరణలో చోటుచేసుకుంటాయి. దీనివల్ల ప్రతీకార చర్య అధికమవుతూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికమవుతుంది. ఊపిరితిత్తులకు అదనపు రక్తం చేరుతుంది. శక్తి గనుక వినిమయం కాకపోతే గుండెనొప్పులు, చక్కెర వ్యాధి సమస్యలు, ఇతర మానసిక సమస్యలు, కోపం, చికాకు అధికమవుతాయి.
థైరాయిడ్గ్రంధి : అదనంగా రక్తంలోకి వచ్చి చేరిన థైరాయిడ్హార్మోన్ఖర్చు కాకపోతే అది కండరాలలో చెడు ప్రభావాన్ని చూపుతుంది.
కాలేయం : రక్తంలోకి అదనంగా వచ్చిచేరిన కొలెస్ట్రాల్వల్ల ధమనులు గట్టిపడతాయి. తద్వారా కాలేయం పనితీరు చెడిపోతుంది.
హైపోథాలమస్‌ : హైపోథాలమస్ఉత్పత్తి చేసే ఎండార్సిన్హార్మోన్లు పెయిన్కిల్లర్లుగా పనిచేస్తాయి. ఇవి త్వరగా ఖర్చు అయిపోవడం వల్ల శరీరంలోని బాధలు అధికమవుతుంటాయి.
రక్త కణాలు : రక్తనాళాలు సంకోచిస్తాయి. రక్తం చిక్కగా మారుతుంది. రక్త ప్రసారం వేగంగా మారుతుంది. చిక్కదనం వల్ల త్వరగా గడ్డ కడుతుంది. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడి వల్ల వచ్చే ఇతర అనర్ధాలను చూడండి.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్డిజార్డర్స్
పెప్టిక్అల్సర్స్‌ ` జి
గ్యాస్ట్రిక్‌, డ్యూయోడినల్‌, కలొనిక్

కార్డియో మస్కులర్డిజార్డర్స్
న్యూరో సర్కులేటరీ ఆస్థీనియా
కార్డియాక్న్యూరోసిస్
ఎసెన్షియల్హైపర్టెన్షన్
కరొనరీ ఎథెరోల్సస్
ఐకామిక్హార్ట్డిసీజ్
యాంజినా పెక్టోరిస్
కార్డియో స్పామ్
కాంగెస్ట్హార్ట్ఫెయిల్యూర్
మియోకార్డియల్ఇన్ఫ్రాక్షన్

శ్వాసకోస పరమైన వ్యాధులు
బ్రాంకియల్ఆస్త్మా
హైపర్వెంటిలేషన్

మూత్రకోశానికి సంబంధించిన వ్యాధులు
యూరినరీ ఇన్ఫెక్షన్
నపుంసకత్వం
ఫ్రిజిడిటీ
స్పెర్మటర్‌, డిస్మెనర్
స్త్రీలలో మెమాగియా

చర్మసంబంధమైన వ్యాధులు
యుటికారియా
యాంజినో న్యూరోటిక్ఓడెమా
సోరియాసిస్
ఎజెమా
న్యూరోడెర్మటైటిస్

ఎండోక్రైన్డిజార్డర్లు
హైపో, హైపర్థైరాయిడిజమ్
డయాబెటిస్మెల్లిటస్
డయాబెటిస్ఇన్స్పిడస్

అనుబంధ డిజార్డర్లు
ఎసిటిహెచ్‌, ఎస్టిహెచ్డిజార్డర్లు
యాంగ్జైటీ, డిప్రెషన్‌,
సైకోజెనిక్తలనొప్పి
టెన్షన్తలనొప్పి
మైగ్రేన్

ఎముక సంబంధిత వ్యాధులు
వెన్నునొప్పి
రుమాటిక్ఆర్థరైటిస్

ఎక్సోక్రైన్డిజార్డర్స్
యాసిన్
నోరు తడారిపోవడం
విపరీతంగా చెమటలు పోయడం

తిండి అలవాట్లు, చూపులో మార్పు రావడం
వాసన గ్రహించడం, రుచిని గ్రహించడంలో మార్పులు

No comments:

Post a Comment