24 October 2012

లక్షణాలు


ఒత్తిడి అందరికీ ఒకేలా ఉండదు. అది ఒక్కొక్కరిలో ఒక్కో రూపంలో బయటపడొచ్చు. ఒత్తిడి లక్షణాలు మనిషికీ మనిషికీ మారిపోతుంటాయి. మొత్తం మీద బాధితుల్లో 50 లక్షణాల్లో కొన్నైనా కనపడతాయని క్రోడీకరించారు పరిశోధకులు.
1. తరచూ తలనొప్పి, దవడల నొప్పులు
2. తెలియకుండానే పళ్లు నూరుతూ ఉండడం
3. మాట తడబడడం, నత్తి రావడం
4. పెదాలు, చేతులు వణకడం

5. మెడనొప్పి, నడుము, కండరాల నొప్పులు
6. తల తేలిపోతున్నట్లు, తిరుగుతున్నట్లు ఉండడం
7. చేతులు నలుపుతూ ఉండడం, మెటికలు విరుస్తూ ఉండడం
8. తరచూ ముఖం కందిపోవడం
9. అరిచేతులు, అరికాళ్లు చల్లబడడం లేదా చెమటలు పట్టడం
10. నోరు ఎండిపోతూ ఉండడం, తరచుగా నోట్లో పుళ్లు పడడం
11. తరచూ జలుబు, హెర్పిస్వంటి వైరల్ఇన్ఫెక్షన్లు రేగుతుండడం
12. చర్మం మీద దద్దుర్లు రావడం, రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉండడం
13. అకారణంగా అలెర్జీ రావడం
14. గుండెల్లో మంట, కడుపునొప్పి, వికారం
15. అతిగా తేన్పులు రావడం, పొట్ట ఉబ్బరం
16. మలబద్ధకం లేదా అతి విరేచనాలు
17. శ్వాసలో ఇబ్బంది, భారంగా శ్వాస విడవడం
18. ఉన్నట్టుండి భయంగా అనిపించడం
19. ఛాతీ పట్టేసినట్టుండడం, గుండె దడ
20. తరచూ మూత్రానికి వెళ్లాలనిపించడం
21. లైంగిక వాంఛ తగ్గిపోవడం
22. ఆందోళన, అన్నింటికీ వర్రీకావడం, అపరాధ భావన
23. పెరిగే కోపం, చికాకు, తరచూ తగాదాలు
24. కుంగిపోవడం, తరచూ మన:స్థితి మారిపోతూ ఉండడం
25. ఆకలి తగ్గడం లేదా పెరగడం
26. నిద్రలేమి, రాత్రి భయాలు, భీతిగొల్పే కలలు
27. ఏకాగ్రత కుదరకపోవడం, బుర్ర అటూ ఇటూ పరుగులు
28. కొత్త విషయాలు పట్టాన తలకెక్కకపోవడం
29. అన్నీ మరిచిపోతుండడం, గందరగోళం పడుతుండడం
30. మామూలు సందర్భాల్లోనూ నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉండడం
31. పని ఎక్కువైన భావనకు లోనవుతూ ఉండడం
32. తరచూ ఏడుపు వస్తున్నట్లు ఉండడం, ఆత్మహత్య ఆలోచన
33. ఒంటరినైపోయానన్న, ఎందుకూ పనికిరానన్న భావన
34. టైముకు పనీ చెయ్యబుద్ధి కాకపోవడం
35. మసలటం, కాళ్లు పాదాలు ఊపుతుండడం
36. కదిపితే చికాకు, అంతర్మధనం పెరగడం
37. చిన్న చిన్న ఇబ్బందులకు కూడా అతిగా స్పందిస్తుండడం
38. తరచూ దెబ్బలు, చిన్నచిన్న ప్రమాదాలకు గురవుతూ ఉండడం
39. అతిగా చేసిందే చేస్తూ ఉండడం, మంకుగా తయారుకావడం.
40. పని సామర్ధ్యం తగ్గిపోవడం
41. పనిలో లోపాల్ని కప్పిపుచ్చేందుకు తరచూ అబద్ధాలాడడం
42. వేగంగా మాట్లాడుతూ ఉండడం, గొణుక్కుంటూ ఉండడం
43. తన్ను తాను అతిగా సమర్ధించుకోవడం, అనుమానాలు పెరగడం
44. ఇతరులతో మాట్లాడడం, భావాలు పంచుకోవడంలో ఇబ్బందులు
45. అందరికీ దూరందూరంగా ఉంటూ ఒంటరితనంలోకి జారడం
46. ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపించడం
47. అతిగా ఏదో ఒకటి, ముఖ్యంగా తీపి పదార్ధాలు తినాలనిపిస్తుండడం
48. ఆహారంతో నిమిత్తం లేకుండా బరువు పెరగడం లేదా తగ్గడం
49. మద్యం, పొగ అలవాట్లు పెరిగిపోవడం
50. ఎప్పుడూ ఏదో ఒకటి కొంటూ షాపింగ్చెయ్యాలనిపిస్తూ ఉండడం

No comments:

Post a Comment