27 October 2012

టెక్నిక్ - 2


ఆటో జెనిక్‌ ట్రైనింగ్‌
సెల్ఫ్‌ హిప్నోటిక్‌ ప్రొసిజర్‌
విశ్రాంతికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఈ విధానంలో ఎవరైనా కూర్చునిగాని, పడుకుని గాని ప్రాక్టీస్‌ చేయవచ్చు. మనకి ఏ పొజిషన్‌ అనుకూలంగా వుంటుందో గమనించండి. ఈ ప్రాక్టీసును చేసే వ్యక్తులు కళ్లు గట్టిగా మూసుకోవాలి. వీటిలో ప్రతిపాదించిన సజెషన్స్‌ను మానసికంగా గాని లేదా వీటిని ముందుగా రికార్డు చేసుకుని గాని వింటూ రిలాక్స్‌ కావాలి.

స్టెప్‌ 1 : చేతులలో బరువుగా ఫీలవడం (2 నిమిషాలు)
నా కుడిచెయ్యి, ముంజేయి, చేయి బరువు ఎక్కుతూ ఉన్నాయి.
నా కుడిచెయ్యి, ముంజేయి, చేయి బరువుగా ఫీలవుతున్నాను.
నా ఎడమచెయ్యి, ముంజేయి, చేయి బరువు ఎక్కుతూ ఉన్నాయి.
నా ఎడమచెయ్యి, ముంజేయి, చేయి బరువుగా ఫీలవుతున్నాను.

స్టెప్‌ 2 : కాళ్లలో బరువుగా ఫీలవడం (2 నిమిషాలు)
నా కుడి తొడ, కాలు, పాదం బరువెక్కుతున్నాయి.
నేను నా కుడితొడ, కాలు, పాదం బరువుగా ఫీలవుతున్నాను.
నా ఎడమతొడ, కాలు, పాదం బరువెక్కుతున్నాయి.
నేను నా ఎడమ తొడ, కాలు పాదం బరువుగా ఫీలవుతున్నాను.

స్టెప్‌ 3 : చేతులలో వేడిమి (2 నిమిషాలు)
నా కుడిచేయి, ముంజేయి మరియు చెయ్యి వేడెక్కుతున్నాయి.
నాకు నా కుడిచేయి, ముంజేయి మరియు చెయ్యి వేడెక్కుతున్నట్లుగా ఫీలవుతున్నాను.
నా ఎడమ చేయి, ముంజేయి మరియు చెయ్యి వేడెక్కుతున్నాయి.
నాకు నా ఎడమ చేయి, ముంజేయి మరియు చెయ్యి వేడెక్కుతున్నట్లుగా ఫీలవుతున్నాను.

స్టెప్‌ 4 : కాళ్లలో వేడి (2 నిమిషాలు)
నా కుడితొడ, కాలు, పాదం వేడెక్కుతున్నాయి.
నా కుడితొడ, కాలు, పాదంలో వేడిమి ఫీలవుతున్నాను.
నా ఎడమ తొడ, కాలు, పాదం వేడెక్కుతున్నాయి.
నా ఎడమ తొడ, కాలు, పాదంలో వేడిమి ఫీలవుతున్నాను.

స్టెప్‌ 5 : గుండె బలం (2 నిమిషాలు)
నా గుండె చప్పుళ్లు సక్రమంగా, స్టడీగా ఉన్నాయి.
నా గుండె బలంగా, ఆరోగ్యంగా వుంది.
నేను నా గుండెలో బలాన్ని పుంజుకుంటున్నాను.

స్టెప్‌ 6 : ఊపిరి బలం (2 నిమిషాలు)
నా ఊపిరి సక్రమంగా, నిశ్చలంగా వుంది.
నా ఊపిరితిత్తులు బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నాయి.
నా శ్వాస నాళం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంది.
నేను నా శ్వాసకోశాలు, శ్వాసనాళం బలంగా, ఆరోగ్యవంతంగా వున్నట్లు ఫీలవుతున్నాను.

స్టెప్‌ 7 :  శరీరంలోని విసీరియల్‌ ఆర్గన్స్‌ అన్నీ బలంగా ఉన్నాయి.
నాలోని అంతర్గత భాగాలు అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి.
నాలోని అంతర్గత భాగాలు అన్నీ ఆరోగ్యవంతంగా ఉన్నాయి.

స్టెప్‌ 8 : ఫాలభాగం చల్లగా వుంది (2 నిమిషాలు)
నా ఫాలభాగం చల్లగా, రిలాక్స్‌డ్‌గా ఉంది.

 స్టెప్‌ 9 : ముగింపు (1 నిమిషం)
నా మనసు, శరీరం రిలాక్స్‌డ్‌గా, విశ్రాంతిగా వున్నాయి.
(నెమ్మదిగా కళ్లు తెరిచి, లేవండి)

No comments:

Post a Comment