19 October 2012

స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టిప్స్‌-2


17. కుటుంబ సభ్యులతో సరదాగా
ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం చాలా ఆరోగ్యకరమైన విషయం. ఇలాంటివారు ఎంతో కాన్ఫిడెంట్‌గా సరదాగా ఉంటారు. అందరితో మంచి కమ్యూనికేషన్‌, సత్సంబంధాలు ఉంటాయి. దాంతో ఒత్తిడి మీ దరికి చేరదు.

18. మీ లైఫ్‌ పార్టనర్‌తో
ఆఫీసులో బిజీ షెడ్యూల్‌తో ఇంటికి లేటుగా వచ్చి హడావుడిగా మీ కార్యక్రమాలు ముగించుకుని మంచం మీద మౌనంగా పడుకుంటే మీ పార్టనర్‌తో మీకు మంచి రిలేషన్స్‌ ఎలా ఉంటాయి? అందుకు మీ లైఫ్‌ పార్టనర్‌కు కొంత టైమ్‌ కేటాయించండి. మాట్లాడండి... అభినందించండి.... ప్రేమించండి, ముద్దూ ముచ్చట్లతో ఆనందంగా గడపండి. ఇక ఒత్తిడి పరార్‌!


19. పిల్లలతో ఎక్కువ ఆనందం
మీకు పిల్లలు ఉన్నారా? అయితే పిల్లలతో ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వారితో మాట్లాడండి.... వారి ఎమోషన్స్‌, వారి అభిరుచులు, వారితో కలిసిపోండి. ఆడుకోండి. ఆనందించండి.... వారు చిన్న పిల్లలయితే ఎత్తుకోండి. ముద్దాడండి... టీనేజర్స్‌ అయితే వారితో స్నేహితులుగా మారిపోండి. ఇక ఒత్తిడిని మీరు దూరం అవుతారు.

20. బుక్‌ రీడింగ్‌
పుస్తకాలు చదివే అలవాటు మిమ్మల్ని అనేక విషయాలవైపు ఆలోచింపచేస్తుంది. మీలో విజ్ఞానంతో పాటు క్రియేటివిటీ, ఆనందం కలుగుతాయి. ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

21. ఫోటో ఆల్బమ్‌
మీరు టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నారా? మానసికంగా గజిబిజిగా ఉందా? ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే మీ ఇంట్లో ఆల్బమ్‌ ఒకసారి తీయడి. ఎన్నో ఫోటోలు, చిన్నప్పటి మీ అనుభూతులు పరిశీలించండి. హాయిగా ఫీల్‌ అవుతారు.

22. గార్డెనింగ్‌
మీ ఇంట్లో గార్డెన్‌ ఉందా? పూలకుండీలు చక్కగా సర్దండి... వాటికి నీరు పోయండి. అలా మీరు ఒక అరగంట సమయాన్ని పూలమొక్కలతో గడపండి... రిలాక్స్‌గా ఫీల్‌ అవండి.

23. మ్యూజిక్‌ వినడం
మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటే మీరు ఎంతో ప్రశాంతతకు లోనవుతారు. ఒంటరిగా ఆలోచించే దాని కన్నా ఓ మంచి సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది.

24.  ఆఫీసు - ఇల్లు పరిశుభ్రత
ఆఫీసు కావచ్చు. ఇల్లు కావచ్చు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు మంచి రిలాక్స్‌డ్‌గా ఉన్న కలర్స్‌ వాడాలి. వస్తువులు టేబుల్స్‌, పుస్తకాలు, బట్టలు చిందరవందరగా ఉండకూడదు.... ఇల్లూ, ఆఫీసు మంచి వాతావరణం స్ఫురించాలి.

25. టెలిఫోన్‌ కాల్స్‌
మీ సెల్‌ఫోన్‌ కాల్స్‌ను పరిమితం చేసుకోండి. ఎక్కువ సమయం పిచ్చాపాటీ విషయాలతో విపరీతమైన కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. కాల్స్‌కు హద్దులు పెట్టండి.

26. ఫైల్‌ - టేబుల్‌ మేనేజ్‌మెంట్‌
ఆఫీసులో మీ టేబుల్‌ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ వహించండి. ఫైల్స్‌ ఎలా మెయింటైన్‌ చేయలో తెలుసుకుంటే మీ టేబుల్‌పై ఏఏ ఫైల్స్‌ మీ దగ్గరుండాలో, ఏ ఫైల్స్‌ దాచిపెట్టాలో వాట ఆర్డర్‌ నెంబర్‌ ఎలా ఉండాలి. తిరిగి వాటిని తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్త పడండి.

27. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
ఆఫీసులో కాని ఇంట్లో కాని కమ్యూనికేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్‌ సరిగా లేకుంటే చాలా టైమ్‌ గ్యాప్‌ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్‌ కూడా దెబ్బతింటాయి. దాంతో ఒత్తిడి ఏర్పడుతుంది... మంచి కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోండి.

28. టైప్‌ ఎ పర్సనాలిటీ నుంచి.... టైప్‌ బి పర్సనాలిటీకి మారండి.
కార్డియాలజిస్టులు వ్యక్తులలో టైప్‌ ఎ అని టైప్‌ బి పర్సనాలిటీ అని రెండు రకాలుగా గుర్తించారు. టైప్‌ ఎ పర్సనాలిటీ గల వ్యక్తులు ఎక్కువ టెన్షన్‌కు గురి అవుతారు. ఎప్పుడూ హర్రీబర్రీగా ఉంటారు. దీంతోవారు స్ట్రెస్‌కు ఈజీగా లోనవుతారు. అలాగే టైప్‌ బి పర్సనాలిటీ వారు నిదానంగా ఆలోచిస్తూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారివారి పనులు చక్కదిద్దుకుంటారు. వీరిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు రిలాక్స్‌డ్‌గా పనులు చేస్తారు. దీనిని గురించి మరింత వివరంగా మీరు - మీ వ్యక్తిత్వంలో చదవండి.

29. ఇంటర్‌ పర్సనల్‌ రిలేషన్స్‌
ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా మనకు ఏర్పడే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. నిత్యం మనం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటే మనం ఇతరులు సంతోషంగా ఉంటారు.

30. ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌
మన మనసుతో మనకు ఉండే సంబంధాన్ని ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌ అంటారు. మన మనసుని మనం ఎలా నియంత్రించుకుంటున్నాం? మనం ఎలా ఆలోచిస్తున్నాం... మనం ఎటువంటి అభిరుచులు కలిగివున్నాం... మన లావాదేవీలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? నా బాధ్యతలు  నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా అనే ఆలోచనల్ని మనం నిరంతరం గమనిస్తుంటాం. ఈ రిలేషన్‌ సక్రమంగా ఉన్నట్లయితే ఒత్తిడి లేకుండా ఉంటుంది.

31. అంతర్మధనం వద్దు.... ఓపెన్‌ అవ్వండి!
ఏదో ఒక సమస్యపై మీలో మీరు తర్కించుకుంటూ బాధపడేదానికన్నా మీ స్నేహితులకు లేదా మీ లైఫ్‌ పార్టనర్‌కు సమస్య వివరించండి. మీకు సొంతంగా పరిష్కారం దొరకని విషయలకు ఇతరుల అనుభవాల నుంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అందుకే మనలో మనం మానసికంగా కుంగిపోవడం కన్నా మిత్రులతో పంచుకుంటూ ఉంటే చాలా రిలాక్స్‌ అవుతాం.

No comments:

Post a Comment