23 September 2012

ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది?

Dr. T.S.Raoతో ఇంటర్వ్యూ

 ప్రశ్న : ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండడం సాధ్యమేనా?
జవాబు : నిజానికి మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. విద్యార్ధి పరీక్షల్లో విజయం సాధించాలన్నా, క్రీడాకారుడు తన రంగంలో విజయం సాధించాలన్నా... అంతెందుకు మనం నిత్య జీవితంలో పనిచేయాలన్నా ఒత్తిడి కలుగుతుంది. ఆయా పనులు పూర్తి చేయాలంటే ఎంతోకొంత స్థాయిలో ఒత్తిడి ఉండడం కూడా అవసరమే. ఇప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత, బిపి అందరికీ ఉంటాయి కదా! అవి మనల్ని మనం రక్షించుకోవడం అవసరం. అలాంటిదే ఒత్తిడి కూడా. అయితే, ఒత్తిడి సాధారణ స్థాయి కన్నా అధికమైతే... అది క్రానిక్గా మారితే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందుకే మనలో అధికంగా ఏర్పడే ఒత్తిడిని సమర్ధవంతంగా మనం ఎదుర్కోగలగాలి. ప్రతివ్యక్తిలోనూ ఏదో ఒక సందర్భంలో తరచుగా ఒత్తిడి ఎదుర్కోవడమనేది సాధారణ విషయమే.


ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తులలో శారీరక లక్షణాలు ఎలా ఉంటాయి?
జవాబు :  ముఖ్యంగా ఊపిరి వేగంగా తీసుకోవడం, ఒక క్రమపద్ధతిలో శ్వాస తీసుకోలేక అసహనంగా కనిపించడం, దవడ కండరాలు బిగుసుకు పోవడం, మెడ కండరాలు బిగుసుకోవడం, మైగ్రేన్‌, టెన్షన్కు తరచుగా లోను కావడం, తల దిమ్ముగా ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కడుపులో గందరగోళ పరిస్థితులు ఏర్పడడం, కండరాలు బిగుసుకుపోవడం, జీర్ణశక్తి మందగించడం, కనుపాపలు పెద్దవి కావడం, పళ్లు బిగపట్టడం ఇలాంటి లక్షణాలను శారీరకంగా గుర్తుపట్టవచ్చు.   

ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తిలో మానసికంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి?
జవాబు : ఎక్కువకాలం స్ట్రెస్కు లోనయ్యే వ్యక్తుల్లో ముఖ్యంగా ఏకాగ్రతా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా పనిపట్లా శ్రద్ధ పెట్టలేరు. నిశితంగా పరిశీలించే శక్తి, సావధానంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తుంది. విశ్లేషణా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా తమలోని మానసిక శక్తిని తక్కువగా వినియోగించుకునే స్థాయికి చేరుకుంటారు. అలాగే వ్యక్తి యొక్క ప్రతిస్పందన వేగం అనూహ్యంగా పతనమవుతుంది. ఒక సమస్య పరిష్కరించుకునే సందర్భంలో తగిన ప్రతిస్పందన పొందడం తక్కువ స్థాయిలో జరుగుతుంది. తద్వారా మానసిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, తమకు తామే సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వస్తారు. తరచుగా తప్పులు చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, విమర్శనాశక్తి లోపించడం, ఆలోచనల్లో గందరగోళం ఏర్పడడం, వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోలేకపోవడం, తరచుగా కోపగించుకోవడం జరుగుతుంది. మానసికంగా అలిసిపోవడం, ఇతరులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, తరచుగా ఇతరులను నిందించడం, ఒక్కోసారి తనను తాను నిందించుకోవడం, మానసికంగా స్థిరంగా లేకపోవడం, సమయపాలన లోపించడం లాంటి లక్షణాలను గమనించవచ్చు.

ప్రశ్న : ఉద్వేగానికి సంబంధించిన మార్పులు ఎలా ఉంటాయి?
జవాబు : స్ట్రెస్కు లోనైనప్పుడు మానసికంగా, శారీరకంగా తన భద్రతను కాపాడుకునే సందర్భంలో శరీరంలోని కండరాలు బిగుసుకుపోతాయి. బాగా టెన్షన్ఫీల్అవుతారు. సహజంగా భయాందోళనలు తగ్గిపోగానే శరీరం మామూలుగా రిలాక్స్అయిపోతుంది. కానీ దీర్ఘకాలం స్ట్రెస్కు గురవుతూ ఉంటే రిలాక్స్అయ్యే సామర్ధ్యం తగ్గిపోతుంది. ఉద్వేగపరంగా అదుపు తప్పి కోపం, ద్వేషం లాంటి సమస్యలు ఏర్పడతాయి. తమకు ఏర్పడే పరిస్థితులను ప్రభావితం చేయగలగడం, వివిధ సందర్భాల్లో వాటిని నియంత్రించే సామర్ధ్యం తగ్గిపోతుంది. తరచుగా యాంగ్జైటీకి, భయాందోళనలకు లోనవుతుంటారు. అభద్రతా భావన, నిస్సహాయత, చనిపోతానేమోననే భయం, చికాకు, కోపం, డిప్రెషన్లక్షణాలు గమనించవచ్చు.

ప్రశ్న : వ్యక్తి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయి?
జవాబు : స్ట్రెస్క్రానిక్గా మారడం వల్ల ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు తడబాటు నత్తి అధికమవుతుంది. ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్లడం, ఎక్కువగా సెలవులు పెట్టడం, బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, స్మోకింగ్‌, డ్రగ్స్‌, ఆల్కహాల్కు అలవాటు పడడం, నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడడం, తీవ్రమైన సంఘర్షణను అనుభవించి ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. కొంతమంది మేనరిజమ్స్లో విపరీతంగా ఏర్పడుతుంది.

ప్రశ్న : బాల్యంపై ఒత్తిడి చూపే ప్రభావం ఏమిటి?
జవాబు : తల్లిదండ్రులలో ఉండే ఉద్వేగాలు, కోపతాపాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల్ని తిట్టడం, కొట్టడం, సరిగా పట్టించుకోకపోవడం, తద్వారా పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒక్కోసారి విపరీత పరిణామాల వల్ల డిప్రెషన్కు కూడా లోనవుతారు. అలాగే బీదరికం, అధిక జనాభా వల్ల కూడా పిల్లల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సాధారణంగా బాలికల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పరీక్షల సమయంలో, స్కూలు మారినప్పుడు, ఇంట్లో పరిస్థితులు మారినప్పుడు పిల్లలు అధికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అది వారి భవిష్యత్తుపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న : పెద్దల్లో ఒత్తిడి ప్రభావం గురించి చెప్పండి.
జవాబు : భార్య భర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం, ఒకరినుంచి ఒకరు దూరమై పోవడం, ఒకరు చనిపోవడం, దీర్ఘకాలిక అస్వస్థతకు లోనుకావడం, ఆర్ధిక ఇబ్బందులు, పిల్లల పెంపకంలో వచ్చే సమస్యలు వీరిలో ఎక్కువగా స్ట్రెస్కు సంబంధించిన సమస్యల్లో ముఖ్యంగా ఆందోళన, గుండెజబ్బులు, మైగ్రేన్‌, తలనొప్పులు, గ్యాస్ట్రిక్ప్రాబ్లమ్స్‌, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు అధికంగా ఉంటాయి.

ప్రశ్న: పనిచేసే ప్రదేశాలలో ఒత్తిడి ఎలా ఉంటుంది?
జవాబు : పనిచేసే ప్రదేశాలలో వ్యవస్థలోని లోపాల వల్ల వ్యక్తి కార్యనిర్వహణా సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించడంలో ఒత్తిడి అధికమవుతూ ఉంటుంది. అలాగెే పనిచేసేచోట తగిన సిబ్బంది లేకపోవడం, క్రింది ఉద్యోగులు చేయాల్సిన పనులు కూడా మనమీదే పడడం లేదా పై అధికారులు చేయాల్సిన నిర్ణయాలు మనమీద పడ్డప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సిబ్బంది సహకారం లేకపోవడం, ఓవర్టైమ్లు ఎక్కువగా చేయడం, నిద్ర, విశ్రాంతి సరిగా లేకపోవడం.
హోదా, జీతం, ప్రమోషన్లు కూడా మనసుపై ఒత్తిడికి కారణమవుతూ ఉంటాయి. వ్యక్తిగత సామర్ధ్యం ఎంతగా ఉన్నప్పటికీ, తగిన హోదాను కల్పించకపోవడం, సీనియారిటీ ఉన్నా అవకాశం కల్పించకపోవడం, రివార్డులు, అవార్డులు కల్పించకపోవడం కొంతమంది ఉద్యోగస్తులలో అభద్రతా భావం ఉంటుంది. ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని భయంతో ఉంటారు. అలాగే పనిలో ఎదురయ్యే సవాళ్లు కూడా ఒత్తిడిని కలగచేస్తాయి. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థల్లో కీలకమైన పాత్రలు నిర్వహించలేకపోతున్నామనే మనోవ్యధకు తరచూ లోనవుతూ ఉంటారు. సంస్థ చెందిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఉద్యోగస్తులు, అధికారులు తమ పదవులు నిర్వ హించడం స్ట్రెస్తో కూడుకున్నదే. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పూర్తి అధికార హోదాలు లేకపోతే విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. కమ్యూనికేషన్స్కిల్స్‌, తగిన నాయకత్వం లేకపోయినా, తగిన శిక్షణ లేకపోయినా సహోద్యోగులతో ఘర్షణ ఉన్నా మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.

ప్రశ్న : మానసిక ఒత్తిడి క్రానిక్గా మారడం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి?
జవాబు : ఒత్తిడికి సంబంధించిన జబ్బులను గురించి చెప్పుకోవాలంటే... కడుపులో మంట ఎక్కువకావడం, అల్సర్లు, ఇరిటబుల్బవుల్సిండ్రోమ్వంటివి కలుగుతాయి. ఒక్కోసారి ఆకలి వెయ్యదు. మ్యారలాజికల్డిస్టర్బెన్స్‌, ఆందోళన, కంగారు, భయం, చెమటలు పట్టడం, నిద్రపట్టకపోవడం, భయంకరమైన కలలు రావడం, గుండెజబ్బులు, ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కొన్ని రకాలైన చర్మవ్యాధులు రావడానికి కూడా ఒత్తిడి కారణమవుతూ ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిపై కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ కావడం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. బరువు తగ్గడం, బరువు పెరగడం, తిండి అలవాట్లు మారతాయి. ఎక్కువగా ఒత్తిడికి లోనైతే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు ఎక్కువ అవుతాయి. డయాబెటిక్స్లో సుగర్శాతం ఎక్కువ అవుతుంది. ఇలా అనేక రకాల రుగ్మతలు మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఏర్పడుతుంటాయి.

ప్రశ్న : సెక్స్పై ఒత్తిడి ప్రభావం ఎలాంటిది?
జవాబు : మానసిక ఒత్తిడి వల్ల కోరిక తగ్గుతుంది. భారభర్తల సుఖసంసారానికి ఇది అవరోధం. స్త్రీలలో కూడా శృంగార జీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ప్రీమెన్స్ట్రువల్సిండ్రోమ్కల స్త్రీలలో ఒత్తిడి లక్షణాలు అధికంగా ఉంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలో సంతాన సాఫల్యతపై కూడా ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రశ్న : మహిళల్లో మానసిక ఒత్తిడి ప్రభవాన్ని గురించి వివరంగా చెప్పండి.
జవాబు : ఒత్తిడికి ఆడామగా తేడాలుండవు. సాధారణ గృహిణి కంటే ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే సరైన టైంకి ఉద్యోగానికి వెళ్లాలి. దారిలో ట్రాఫిక్జామ్‌, ఈవ్టీజింగ్‌.... పనిచేసే చోట లింగవివక్ష, వేధింపులు, పనిభారం వీరిలో మానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దీనివల్ల తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతోనూ, భర్తతోనూ దగ్గరితనం లేకుండా పోతుంది. చాలామంది స్త్రీలలో కోపం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ టెన్షన్‌, నిద్రపట్టకపోవడం, పిల్లల పెంపకం గురించి ఆదుర్దా చెందడం వంటివి జరుగుతాయి.

ప్రశ్న : జ్ఞాపకశక్తిపై ఒత్తిడి ప్రభావం ఎంత?
జవాబు : జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, అధ్యయనం... అన్నింటిమీదా ఒత్తిడి ప్రభావం చాలాఎక్కువగానే ఉంటుంది. చేసే పనిమీద శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రత లోపం వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. లాంగ్టర్మ్‌, షార్ట్టర్మ్‌, వర్కింగ్మెమరీ.... ఇలా అన్నింటిలోనూ స్థాయి తగ్గిపోతూ ఉండడం గమనించవచ్చు. ఒత్తిడి వల్ల విద్యార్ధులు పరీక్షల్లో రాణించలేరు.

ప్రశ్న : గర్భిణీ స్త్రీలపై మానసిక ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు : గర్భవతులు ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏవిధమైన ఆందోళనలకు గురికాకూడదని మన పెద్దలు చెబుతుండేవారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి వల్ల గర్భస్రావం అయ్యేందుకు 50% వరకూ అవకాశం ఉంది. లోపలి బిడ్డ ఎదుగుదలపై కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. తల్లి మానసికంగా తరచుగా ఆందోళనకు గురవుతూ ఉంటే, ఒత్తిడికి లోనైనా పుట్టబోయే బిడ్డ బ్రెయిన్ఎదుగుదలపై కూడా ప్రభవాన్ని చూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ప్రశ్న : అందరూ స్ట్రెస్కు లోనవుతారా?
జవాబు : తప్పకుండా. ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తి స్రెస్కు లోనవుతూనే ఉంటారు. అయితే కొంతమంది వారి మానసిక శక్తి వల్ల ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. కొంతమంది చిన్న ఒత్తిడికే అప్సెట్అయిపోతూ ఉంటారు. స్ట్రెస్ను ఎదుర్కోవడంలో వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లకు, గుండెజబ్బులకు ఉన్న సంబంధంపై ఫ్రీడ్మెన్‌, రోస్మెన్అనే ఇద్దరు అమెరికన్కార్డియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. వీరు వ్యక్తులను టైప్-, టైప్‌-బిలుగా వర్గీకరించారు. టైప్‌` పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు జీవితంలో విశ్రమించరు. ఎప్పుడూ వారికి తొందరే. అనేక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు జీవితంలో చాలా పెద్ద పనులు నెత్తిన పెట్టుకుంటారు. అపజయాన్ని అంగీకరించరు. కోపం ఎక్కువ. ఎప్పుడూ మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం గల వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది.
టైప్‌ - బి పర్సనాలిటీ గల వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. విశ్రాంతికి ఎక్కువ విలువ ఇస్తారు. నిదానంగా ఆలోచిస్తారు. జరిగేది జరగక మానదు. నిదానంగా కారణాలు పరిశీలించాలంటారు. ఓటమిని అంగీకరిస్తారు. ఓర్పు, సహనంతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లో గుండెజబ్బులు వచ్చే శాతం చాలా తక్కువ అని తేలింది.

ప్రశ్న : మానసిక ఒత్తిడిని ఎలా అదుపులో ఉంచుకోవాలి... రిలాక్సేషన్పద్ధతులు ఏమిటి?
జవాబు : స్ట్రెస్ను అదుపులో ఉంచుకోవడానికి పళ్లు, పచ్చికూరగాయలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వదిలేయాలి. బాగా వ్యాయామం చేయాలి. యాక్టివ్లైఫ్స్టైల్అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే అలవాటు మార్చుకోవాలి. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నవారిపై స్ట్రెస్ఎక్కువ ప్రభావం చూపించదు. అయితే అతి వ్యాయామం పనికిరాదు. ఉదయం, సాయంత్రం నడక చాలా మంచి రిలాక్సేషన్ఇస్తుంది. జిమ్కు వెళ్లడం, స్విమ్మింగ్చేయడం కూడా మంచి రిలాక్సేషన్ఇస్తుంది. యోగా, మెడిటేషన్ప్రాక్టీస్చేయడం కూడా మంచిదే. ప్రోగ్రెసివ్మజిల్రిలాక్సేషన్‌, సెల్ఫ్హిప్నాసిస్‌, జాకబేసన్రిలాక్సేషన్‌, ఆటోజెనిక్స్ద్వారా మంచి రిలాక్సేషన్పొందవచ్చు.
అలాగే టైమ్మేనేజ్మెంట్‌, స్కిల్స్ట్రయినింగ్‌, ఎసెర్టివ్బిహేవియర్‌, ప్లానింగ్‌, డెసిషన్మేకింగ్‌, నెగెటివ్ఎమోషన్స్ను కంట్రోల్చేయడం ద్వారా ప్రశాంత జీవనాన్ని అలవాటు చేసుకోవచ్చు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మీకున్న హాబీలను అభివృద్ధి చేసుకోవడం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడపడం, పిల్లలతో సరదాగా గడపడం, సంగీతం, సాహిత్యం, నృత్యం, పెయింటింగ్‌, కుట్లు, అల్లికలు, ప్రకృతి ఆరాధన ఇలంటివి అన్నీ రిలాక్స్అయ్యేందుకు దోహద పడతాయి.
మంచి గృహవాతావరణం, కమ్యూనికేషన్స్కిల్స్కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, హ్యూమన్రిలేషన్స్ను పెంపొందించుకోవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి విశ్రాంతి, ఆనందం కలుగుతాయి.
ఇంకా తీవ్రంగా ఉండే సమస్యలకు సైకాలజిస్ట్ద్వారా కౌన్సిలింగ్తీసుకోవడం, సైకియాట్రిస్ట్ద్వారా మందులు వాడడం వల్ల స్ట్రెస్కి సంబంధించిన సమస్యలను అధిగమించి రిలాక్స్అవ్వచ్చు.

 

No comments:

Post a Comment